అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో జెండాను ఎగురవేసిన అనంతరం విద్యార్థులు దేశ నాయకుల చిత్ర పటాలు, జాతీయ నాయకుల వేషధారణలతో ప్రధాన కూడళ్లలో ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులంతా కలిసి ఎన్టీర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి దేశ భక్తి గీతాలను ఆలపించారు.
దేశ చరిత్రను కీర్తిస్తూ మానవహారం - high school students rally
అనంతపురం జిల్లా కదిరిలో దేశ నాయకుల చిత్రపటాలు, జాతీయ నాయకుల వేషధారణలతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.
దేశ చరిత్రను కీర్తిస్తూ మానవహారం