ఎంపీపీ ఎన్నిక దృష్ట్యా అనంతపురం జిల్లా తలుపుల మండలంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్న తలుపుల లో పది స్థానాల్లో వైకాపా, రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో స్థానిక శాసనసభ్యుడు సిద్ధారెడ్డి, సీఈసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో నూతన పాలక వర్గ ప్రమాణస్వీకారంతో పాటు ఎంపీపీ వైస్ ఎంపీపీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలూ జరగనున్నాయి.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు - ananthapuram district latest news
అనంతపురం జిల్లా తలుపులలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీపీ ఎన్నిక దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తమయ్యారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు