నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన అడదాకులపల్లి చెరువు గేటు - అడదాకులపల్లి చెరువు తాజా న్యూస్
అడదాకులపల్లి సమీపంలోని చెరువుకు ఏర్పాటు చేసిన గేటు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని గండి పూడ్చే పనులు చేపట్టారు.
![నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన అడదాకులపల్లి చెరువు గేటు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన అడదాకులపల్లి చెరువు గేటు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6186344-781-6186344-1582566718442.jpg)
నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన అడదాకులపల్లి చెరువు గేటు
నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన అడదాకులపల్లి చెరువు గేటు
అనంతపురం జిల్లా గొల్లపల్లి జలాశయం నుంచి మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో అడదాకులపల్లి సమీపంలోని చెరువుకు ఏర్పాటు చేసిన గేటు కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గండి పూడ్చే పనులు చేపట్టారు. ఇదే మార్గంలో పెనుకొండ మండలం కొండాపురం చెరువుకు నీటి విడుదల చేయడానికి గతంలో ఏర్పాటు చేసిన మరో పైపులైను మూసి వేసేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.