ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాంట్ కడుతున్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు: హైకోర్టు - కట్టకిందపల్లి వాటర్ ప్లాంట్ నిర్మాణంపై హైకోర్టులో వాదనల వార్తలు

అనంతపురం జిల్లా కట్టకిందపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అక్రమంగా వాటర్ ప్లాంట్ కడుతున్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారంటూ.. హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది

high court hearings on water plant build in government school in kattakindapalli ananthapuram district
ఏపీ హైకోర్టు

By

Published : Jun 15, 2020, 7:46 PM IST

అనంతపురం జిల్లా కట్టకిందపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అక్రమంగా వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పాఠశాల భవనం కూల్చి ప్లాంట్ కడుతున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం... సంబంధిత వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details