MLC ANANTHABABU PETITION : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే కేసు నమోదైన 90 రోజుల తర్వాత డీఫాల్ట్ బెయిల్‌కు అవకాశం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. 80 రోజుల తర్వాత ఛార్జిషీట్ వేసి వెనక్కి తీసుకున్నారన్న అనంతబాబు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ కేసులో అది సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉందని తెలిపింది. అనంతబాబు పిటిషన్‌పై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం, సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులకు నోటీసులు పంపించింది. తదుపరి విచారణను డిసెంబర్ 12కి వాయిదా వేసింది.
కేసు నమోదైన 90 రోజుల తర్వాత.. డీఫాల్ట్ బెయిల్‌కు అవకాశం.. కానీ: హైకోర్టు
HC ON MLC ANANTHABABU PETITION : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. క్రిమినల్ కేసు నమోదైన 90 రోజుల తర్వాత డీఫాల్ట్ బెయిల్‌కు అవకాశం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
HC ON MLC ANANTHABABU PETITION