అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని పాపిరెడ్డి పల్లి గ్రామంలో గత పది రోజులుగా తాగునీరు లేక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి తాగునీటిని సరఫరా చేసే మోటార్ మరమ్మతులకు గురైంది. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. పట్టించుకోకపోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మతులకు అవసరమైన సామగ్రి లభించడం లేదని అధికారులు.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ఫలితంగా చేసేదేమీ లేక.. తాగునీటిని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
దాహంతో అల్లాడుతోన్న పాపిరెడ్డిపల్లి
గత పది రోజులుగా అనంతపురం జిల్లా పాపిరెడ్డి పల్లి వాసులు దాహంతో అల్లాడుతున్నారు. గ్రామంలో తాగునీరు సరఫరా చేసే మోటారు మరమ్మతులకు గురవడంతో వారి కష్టాలు తీవ్రమయ్యాయి.
దాహంతో అల్లాడుతోన్న పాపిరెడ్డిపల్లి