అనంతపురం జిల్లా పెనుకొండలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో అక్రమంగా నిర్మించుకున్న దుకాణాలను నగర పంచాయతీ అధికారులు తొలగిస్తుండగా... సీఐటీయూ, సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. దుకాణాలు తొలగించవద్దంటూ బైఠాయించి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి, స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన నగర పంచాయతీ కమిషనర్ కృష్ణ... రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా దుకాణాలను తొలగిస్తున్నామని అన్నారు.
పెనుకొండలో ఉద్రిక్తత... ఆందోళనకారుల అరెస్టు - news updates in penugonda
అనంతపురం జిల్లా పెనుకొండలో సీఐటీయూ, సీపీఐ, సీపీఎం నేతల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న దుకాణాలను కూల్చవద్దంటూ నినాదాలు చేశారు.
పెనుకొండలో ఉద్రిక్తత