అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తామని ఆర్డీవో మధుసూదన్ స్పష్టం చేశారు. పట్టణంలోని వ్యాపారులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఇప్పటివరకు ధర్మవరంలో 116 పాజిటివ్ కేసులు నమోదు అయినందున.. ఈ నెలాఖరు వరకు పట్టణంలో పట్టు చీరల దుకాణాలు తెరవవద్దని ఆదేశించారు. ఆది, మంగళ, గురు, శనివారాలలో మాత్రమే ప్రజలు నిత్యావసర సరకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ లాక్డౌన్ పటిష్ఠంగా అమలు అయ్యేలా...మూడు బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు.
'వైరస్ వ్యాప్తి నివారణకు ధర్మవరంలో కఠినంగా లాక్డౌన్' - dharmavaram latest news
అనంతపురం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలోని ధర్మవరం పట్టణంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు.. పట్టణంలో లాక్డౌన్ విధించారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
'వైరస్ వ్యాప్తి నివారణకు ధర్మవరంలో కఠినంగా లాక్డౌన్'