ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో భారీ వర్షం... ఇళ్లల్లోకి వరద - అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ వర్షం

అనంతపురం జిల్లా ఉరవకొండలో కుండపోత వర్షం కురుస్తుండటంతో... లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇందిరానగర్, శివరామిరెడ్డి కాలనీల్లోని గుడిసెలు, ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. చేనేత మగ్గాల్లోకి నీళ్లు చేరి భారీ నష్టం చేకూరింది.

By

Published : Oct 10, 2020, 10:14 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి కురిసిన భారీ వర్షానికి వరదల కారణంగా వర్షపు నీరు ఇళ్లల్లోకి ప్రవేశించాయి. రోడ్లుపై నీళ్లు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని పలు కాలనీలో భారీ వర్షానికి ఇంటి గోడలు కూలిపోయాయి. ఇందిరానగర్, పదో వార్డులో 4 చోట్ల ఇల్లు కూలిపోయాయి.

నీటి పాలైన చేనేత ముడి సరుకులు

చేనేత మగ్గాల గుంతల్లోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. పట్టణంలో దాదాపుగా 30 నుండి 40 చేనేత మగ్గల్లోకి నీళ్లు వెళ్లాయి. భారీ వర్షాల కారణంగా అటు రైతులకు, ఇటు నేతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నేత నేసిన చీరలు, చేనేత ముడిసరుకులు అన్ని నీటిపాలు కావడంతో నేతన్నల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇదీ చదవండి:

'అమరావతి, పోలవరం రాష్ట్రాభివృద్ధిలో కీలకం'

ABOUT THE AUTHOR

...view details