రాష్ట్రంలో పలు జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కృష్ణా జిల్లా...
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. విజయవాడ, గన్నవరం, ఉయ్యూరు, పెనమలూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.