భారీ వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు సైతం జలమయమైన ఘటన...అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలో స్థానికులను అవస్థలకు గురిచేస్తోంది.రాత్రి104.06మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా...తాహసీల్దార్,మండల ప్రజా పరిషత్,వ్యవసాయ అధికారి,వెలుగు కార్యాలయాలు,ప్రభుత్వ వైద్యశాల,పాఠశాలలు నీట మునిగాయి.ఉద్దేహళ్ వద్ద వేదావతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.వంతెనపై నీరు ప్రవహించడం వల్ల బళ్లారి-కళ్యాణదుర్గం నడుమ రాకపోకలు స్తంభించాయి.స్థానికంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
భారీ వర్షాలకు నీటమునిగిన ప్రభుత్వకార్యాలయాలు
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ వైద్యశాల, పాఠశాలలు నీటమునిగాయి. ఉద్దేహళ్ వద్ద వేదావతి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. బళ్లారి - కళ్యాణదుర్గం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
rain