ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డుపైకి చేరిన వాగు నీరు.. కొట్టుకుపోయిన కారు - అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

అనంతపురం జిల్లాలో వారం రోజులనుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. నీరు రోడ్లమీదకు వచ్చి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రజాపురం - కొజ్జేపల్లి వద్ద రోడ్డు దాటడానికి ప్రయత్నించి ఒక కారు వాగులో కొట్టుకుపోయింది.

heavy rains in ananthapuram ponds and lakes full
రోడ్డుపైకి చేరిన వాగు నీరు.. కొట్టుకుపోయిన కారు

By

Published : Jul 30, 2020, 12:32 PM IST

రోడ్డుపైకి చేరిన వాగు నీరు.. కొట్టుకుపోయిన కారు

అనంతపురం జిల్లాలో గత వారం రోజులనుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. నీరు రోడ్లమీదకు వచ్చి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత రాత్రి కురిసిన వర్షానికి గుత్తి సమీపంలోని చెరువు పొంగి రజాపురం-కొజ్జేపల్లి వద్ద రహదారిపై నీరు చేరింది. అందులో నుంచి రోడ్డు దాటడానికి ప్రయత్నించి ఒక కారు వాగులో కొట్టుకుపోయింది. అందులో ఉన్న వ్యక్తులను స్థానికులు రక్షించారు. కారు ఒక రాయిని తగులుకుని ఆగిపోయింది.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఆ నీటిలో రోడ్డు దాటుతుండగా మధ్యలోకి వెళ్లి ఆగిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో నడిపి బస్సును దాటించటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న నీటితో తమ ప్రాంతంలో వాగులు పొంగుతున్నాయని స్థానికులు అంటున్నారు. చెరువులలో పూడికతీత పనులు చేయించిఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపైకి నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details