ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Heavy rains in AP అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు.. - heavy rain in anantapur today

Heavy rains జోరు వానలకు కరవు సీమ అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కర్ణాటకలో కురుస్తున్న కుండపోత వానలతో.. అక్కడి నుంచి రాష్ట్రంలోకి వచ్చే నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. రాయదుర్గంలో జూన్ నుంచి సెప్టెంబర్ 7 వరకు అత్యధికంగా 533 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురంలో ఇప్పటి వరకు అత్యధికంగా 845 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిల్వ గరిష్టస్థాయికి చేరటంతో... నీటిని వైఎస్సార్​ జిల్లాలోకి విడుదల చేస్తున్నారు. పెన్నానది సైతం నురగలు కక్కుతూ ప్రవహిస్తోంది. ముందస్తు సమాచారం లేకుండానే నీటిని వదలటంతో.. గ్రామాలను వరద ముంచెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నీటమునిగి నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు.

Heavy rains in AP
అనంతపురం పుట్టపర్తి జిల్లా భారీ వర్షాలు

By

Published : Sep 8, 2022, 1:51 PM IST

పుట్టపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు

AP flood flow జోరు వానలకు కరవు సీమ అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కర్ణాటకలో కురుస్తున్న కుండపోత వానలతో.. అక్కడి నుంచి రాష్ట్రంలోకి వచ్చే నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఎండిపోయిన వేదవతి, హగిరి నదులు సైతం ప్రాణం పోసుకున్నాయి. వాటి సామర్థ్యానికి మించి ప్రవహిస్తున్నాయి. భైరవానితిప్పకు వస్తున్న నీటి ప్రవాహం కళ్యాణదుర్గం, గుమ్మగట్ట మండలాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పెన్నా, చిత్రావతి నదులకు వరద పోటెత్తుతోంది. వాగులు, వంకల ఉద్ధృతికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏడాది పొడవునా కురవాల్సిన వానలు కేవలం 10 రోజుల్లోనే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాయదుర్గంలో జూన్ నుంచి సెప్టెంబర్ 7 వరకు అత్యధికంగా 533 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురంలో ఇప్పటి వరకు అత్యధికంగా 845 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు.. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గుమ్మగట్ట మండలంలోని భైరవానితిప్ప జలాశయానికి 30 ఏళ్లుగా ప్రవాహాలు లేవు. ప్రస్తుతం వరదతో 'బీటీ ప్రాజెక్టు' అన్ని గేట్లు ఎత్తి 66 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భారీ ప్రవాహంతో వేదవతి నది పరవళ్లు తొక్కుతోంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక నుంచి వరద ప్రవాహం

కర్ణాటక నుంచి సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించే చిత్రావతి నదికి వరద పోటెత్తుతోంది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిల్వ గరిష్టస్థాయికి చేరటంతో... నీటిని వైఎస్సార్​ జిల్లాలోకి విడుదల చేస్తున్నారు. పెన్నానది సైతం నురగలు కక్కుతూ ప్రవహిస్తోంది. రామగిరి మండలంలోని అప్పర్ పెన్నా ప్రాజక్టుకు చాలా ఏళ్ల తర్వాత ఎక్కువ మొత్తంలో వరద రావటంతో.. గేట్లు తెరిచి నీటిని పెన్నాకు వదులుతున్నారు. దీనివల్ల దిగువనున్న పీఏబీఆర్​, ఎంపీఆర్​, చాగల్లు జలాశయాలకు భారీగా వరద చేరుతోంది. ముందస్తు సమాచారం లేకుండానే నీటిని వదలటంతో.. గ్రామాలను వరద ముంచెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నీటమునిగి నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు .

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

అధికార వైకాపా ఎమ్మెల్యేలు వరద ముంచెత్తిన ప్రాంతాలవైపు కన్నెత్తి చూడకపోవటంతో బాధితులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.. రాయదుర్గంలో ఇళ్లలోకి నీరుచేరి అక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా వైకాపా ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లని పరిస్తితి నెలకొంది. అక్కడ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పట్టణంలో తిరుగుతూ ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళుతున్నారు . జిల్లాలో భారీ ప్రవాహాలు నమోదవుతున్న జలాశయాలను జిల్లా కలెక్టర్ పరిశీలిస్తూ, అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details