ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, గుత్తి ప్రధాన రహదారులపై నీరు చేరింది. పాదచారులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండటంతో.. మూడు గంటలపాటు భారీగా వానలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లు, దుకాణాలలోకి నీరు చేరింది.
గుతంకల్లు పాత బస్టాండ్లో మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాలు.. ఒక్కసారిగా ఆగిపోతుండటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గుత్తిలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిస్తే.. ఈ తరహా ఇబ్బందులు తలెత్తవని స్థానికులు వాపోతున్నారు.