తుఫాన్ ప్రభావంతో సెప్టెంబర్ మాసంలో మూడు విడుతలుగా కురిసిన వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లాయి. ఈ నేపథ్యంలో పంట నష్టం వాటిల్లింది. అనంతపురం నగరంలో తాజాగా.. సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురవగా.. మరికొన్ని చోట్ల భారీ వానలు పడ్డాయి. తాజాగా కురుస్తున్న వర్షాలతో వేరుశనగ పంట తొలగిస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఎప్పటికప్పుడు వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టాలని అనంత వాసులు కోరుతున్నారు.