ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో గాలి వాన బీభత్సం

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, కళ్యాణదుర్గంలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి రోడ్లన్ని జలమయమయ్యాయి.

ఉరవకొండలో గాలి వాన బీభత్సం
ఉరవకొండలో గాలి వాన బీభత్సం

By

Published : Apr 22, 2021, 8:48 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులు, ఉరములతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. పట్టణంలోని పోట్టి శ్రీరాములు కూడలి వద్ద ఓ ఇంటిపై పిడుగు పడింది. బుధవారం కురిసిన వర్షానికి ఆరటి పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు.

కళ్యాణదుర్గం ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. చాపిరి గ్రామంలో వడగండ్ల వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి స్కూల్ ద్వారం పైన నేమ్ బోర్డ్ విరిగిపడింది , దొడగట్ట, చెర్లోపల్లిలో ఈదురు గాలులకు చెట్లు విరిగిపడటంతో కరెంట్ స్తంభం పడిపోయింది. తిమ్మాపురంలో రవి అనే రైతు పొలంలో పిడుగుపాటుకు ఆవు మృతి చెందింది.

ఇదీ చదవండి:

సమగ్ర భూసర్వే: 'ఎక్కడా అవినీతికి తావుండొద్దు'

'పర్యావరణ పరిరక్షణకు పటిష్ఠ చర్యలు అవసరం'

ABOUT THE AUTHOR

...view details