అనంతపురం జిల్లాలోని సోమందేపల్లి, పెనుకొండ మండలాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సోమందేపల్లి మండలంలో 80.6 మిల్లీ మీటర్లు, పెనుకొండ మండలంలో 48.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఈ వానతో పలు గ్రామాల్లో వాగులు, వంకలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. రంగేపల్లి-చెన్నాపురం గ్రామాల మధ్య ఉన్న రైల్వే భూగర్భ వంతెన మునిగిపోయింది. సుమారు రెండు వారాల తర్వాత.. భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు - అనంతపురం జిల్లాలో వానలు
అనంతపురం జిల్లా సోమందేపల్లి, పెనుకొండ మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. చాలా రోజుల విరామం అనంతరం వర్షం కురవటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
![భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు Heavy rain in somandepalli, penukonda in ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8638008-125-8638008-1598955555629.jpg)
భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులు