ఎప్పుడూ కరవుతో అల్లాడే అనంతపురం జిల్లా.... ఈసారి భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. నైరుతి రుతుపవనాలు ఖరీఫ్‌లో ముఖం చాటేసినా... కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలకు ప్రాణం పోశాయి. ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన అన్నదాతలు... రబీలో శనగపప్పు, చిరుధాన్యాలు సాగుచేసి.. కొంతవరకైనా నష్టాలను పూడ్చుకోవచ్చనే ఆశతో ఉన్నారు. దశాబ్దాలుగా చుక్కనీరు కనిపించని చెరువులు సైతం ఈసారి నిండు కుండలను తలిపిస్తున్నాయి. చెక్ డ్యాంల్లోనూ భారీగా నీరు ఉండడం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. రబీ సాగుకు ఈ వర్షాలు చాలా అనుకూలంగా ఉంటాయని అన్నదాతలు ఆనందిస్తున్నారు.
అనంత తడిసింది.. రైతుల్లో ఆశలు పెంచింది - అనంత తడిసింది
అనంతపురం జిల్లాలో ఈసారి కరవుతీరా వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాలు రైతులను కొంత నష్టపరిచినా... ప్రస్తుతం పుష్కలంగా వానలు పడుతున్నాయి.
heavy rain
జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నదుల్లోకి భారీగా నీరు చేరింది. గుండ్లపల్లి, వేదవతి, పెన్నా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కళ్యాణదుర్గంలో అత్యధికంగా వర్షాలు పడ్డాయని అధికారులు తెలిపారు. 63 మండలాల్లో భారీ వర్షాలు నమోదైనట్లు వివరించారు. జిల్లాలో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో ఉద్యాన పంటల రైతుల్లో ఆనందం నెలకొంది. భూగర్భ జలాలు పెరిగి బోర్లకు నీరందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.