ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు

అనంతపురం జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. రహదారులపై వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఈ క్రమంలో బళ్లారి-గుంతకల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

heavy rain in ananthapuram
heavy rain in ananthapuram

By

Published : Sep 26, 2020, 4:41 PM IST

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. డోనేకల్లు వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బళ్లారి- గుంతకల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

గత వారంలో కురిసిన వర్షాలకు ఈ వర్షాలు తోడవడంతో.. రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా విడపనకల్లు మండలంలో మిరప పంట వేసిన రైతు మరింత ఆందోళన చెందుతున్నాడు. తమ పంటలు కుళ్ళిపోయి.. నష్టపోతామని భయపడుతున్నారు. ఉరవకొండ , వజ్రకరూరు మండలాల్లో తెల్లవారుజాము నుంచి ఓమోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. విడపనకల్లు మండలంలో 63.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details