రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షం(rain) కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అనంతపురం జిల్లా..
అనంతపురం జిల్లా( గుంతకల్లులో భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరుపు లెకుండా కురిసిన వర్షానికి పలు కాలనీలతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి సమీపంలో పిడుగుపాటుకు ఇద్దరు పశువుల కాపరులు మృత్యువాత పడ్డారు. మృతులు మోహన్‌లాల్ నాయక్, తిమ్మప్పగా గుర్తించారు. భారీ వర్షాలకు పెన్నా నది, కుశవతి నదులు నీటి ప్రవాహంతో కళకళలాడుతున్నాయి.