ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో భారీగా కర్ణాటక మద్యం పట్టివేత - Karnataka liquor illegal transport news update

అనంతపురం జిల్లా పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. జిల్లాలో పలు చోట్ల జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున మద్యం పట్టుబడినట్లు చెప్పారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

heavy Karnataka liquor
అనంతలో భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

By

Published : May 26, 2021, 11:28 AM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం బంగారుపాళ్యం గ్రామంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రభాకర్ అనే వ్యక్తి నుంచి 182 కర్ణాటక మద్యం పాకెట్లు పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని.. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను ఎస్ఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.

పరారైన నిందితులు..

ఉరవకొండ పట్టణ శివార్లలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. చాబాల వద్ద కొందరు కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో.. పోలీసులు దాడులు చేశారు. 1152 టెట్రా ప్యాకెట్ల మద్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల రాకను గుర్తించిన నిందితులు పరారయ్యారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని ఎస్సై వెల్లడించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:

4 లక్షలు విలువైన కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు.. ఏడుగురు అరెస్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details