అనంతపురం జిల్లాలో శుక్రవారం అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,387 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. శుక్రవారం ఒక్కరోజే తొమ్మిది మంది మృతి చెందగా... జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 114కు పెరిగింది. జిల్లాలో 14 వేల 700 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం 8,427 మంది ఆసుపత్రులు, హోం ఐసోలేషన్ ద్వారా చికిత్స తీసుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలో ఆగని కరోనా వ్యాప్తి
అనంతపురం జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శుక్రవారం వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో తొమ్మిది మంది మృతిచెందారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 14,700కు చేరింది.
అనంతపురం జిల్లాలో ఆగని కరోనా వ్యాప్తి
ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పదివేల వరకు వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఓవైపు పరీక్షల సంఖ్య పెరుగుతుండగా.. రోగుల సంఖ్యా అదే స్థాయిలో పెరుగుతోంది. హిందూపురం, బత్తలపల్లి, అనంతపురంలో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రుల్లో రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. అయిదు ప్రైవేట్ ఆసుపత్రులను కొవిడ్ ఆసుపత్రులుగా మార్చి.. వైద్యం అందిస్తున్నారు.
ఇదీచదవండి.