అనంతపురం జిల్లా రాయదుర్గం 29వ వార్డు తెదేపా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుళ్లారి జ్యోతి భర్త చిన్నవీరకు చెందిన ఫిజియోథెరపీ కేంద్రంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతపురం అడిషనల్ డీఎంహెచ్ఓ రామ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.
తెదేపా కౌన్సిలర్ అభ్యర్థి ఫిజియోథెరపీ కేంద్రంపై దాడులు - ananthapuram district latest news
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ తెదేపా అభ్యర్థి భర్తకు చెందిన ఫిజియోథెరపీ కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలపై స్పందించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు... తెదేపా అభ్యర్థులను అధికార వైకాపా నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆక్షేపించారు.
తెదేపా కౌన్సిలర్ అభ్యర్థి ఫిజియోథెరపీ కేంద్రంపై దాడులు
ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు... తెదేపా అభ్యర్థి జ్యోతి భర్తకు చెందిన ఫిజియోథెరపీ కేంద్రంపై దాడులు నిర్వహించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికారులు... స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఒత్తిడితో తెదేపా అభ్యర్థులను వేధింపులకు గురి చేయడం సరికాదని ఆక్షేపించారు.
ఇదీచదవండి.
అమరావతి మహిళలపై దాడి దారుణం: చంద్రబాబు
TAGGED:
అనంతపురం జిల్లా నేటి వార్తలు