ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ ఆస్పత్రుల్లో సమస్యలుంటే ఫోన్​ చేయండి: ఆళ్ల నాని - ఏపీలో కరోనా మరణాలు

కొవిడ్ ఆస్పత్రుల్లో ఎలాంటి సమస్యలైనా ఉంటే బాధితులు... వెంటనే సంబంధిత నెంబర్లకు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. అనంతపురం జిల్లాలో కరోనా నివారణ చర్యలపై అధికారులతో ఆయన సమీక్షించారు.

health minister alla nani
health minister alla nani

By

Published : Aug 3, 2020, 3:43 PM IST

Updated : Aug 3, 2020, 4:22 PM IST

కరోనా నివారణ చర్యలపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అనంతపురంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు.

కొవిడ్ బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఆర్డీటీ, సవెరా ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యం, భోజనం, ఇతర వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వం ప్రతి రోజు ఒక్కో బాధితుని కోసం 500 రూపాయలు ఆహారం కోసం ఖర్చు చేస్తోందని మంత్రి వివవరించారు. వైద్యంతో పాటు ఇతర సేవల్లో సమస్యలుంటే...1902, 1440, 104నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

Last Updated : Aug 3, 2020, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details