ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గర్భిణీ మృతికి కారణమైన ఆస్పత్రి సిబ్బందిపై వేటు

గర్భిణీ మహిళకు ఒక గ్రూపు రక్తం ఎక్కించబోయి... మరో గ్రూపు రక్తం ఎక్కించి ప్రాణం పోవడానికి కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఐదుగురిని సస్పెండ్ చేశారు.

By

Published : Jun 29, 2019, 4:12 PM IST

Published : Jun 29, 2019, 4:12 PM IST

వైద్య విద్య సంచాలకులు బాబ్జి

వైద్య విద్య సంచాలకులు బాబ్జి

అనంతపురం సర్వజనాసుపత్రిలో గర్భిణీకి ఒక గ్రూపు రక్తం ఎక్కించబోయి... మరో గ్రూపు రక్తం ఎక్కించి ప్రాణం పోవడానికి కారణమయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు సిబ్బందిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. తాడిపత్రికి చెందిన అత్తార్ భాను ప్రసవం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. రెండు రోజుల క్రితం ఆపరేషన్ చేయగా.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే... భానుకు రక్తం తక్కువగా ఉండటంతో వైద్యులు రక్తం ఎక్కించాలని చెప్పారు. మహిళది ఓ పాజిటివ్ కాగా... ఆమె కుటుంబసభ్యులు రక్తం సేకరించి ఇచ్చారు. సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళకు ఓ పాజిటివ్ ఇవ్వకుండా... బీ పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో ఆమె రక్తం ఎక్కించిన కాసేపటికే మృతి చెందింది.

ఈ విషయాన్ని వైద్యులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించగా... ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనను సీరియస్​గా తీసుకున్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ విచారణ చేపట్టారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు బాబ్జి శుక్రవారం ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధ్యులైన రక్తనిధి ఇన్​ఛార్జి శివకుమార్, ఫెథాలజిస్టు హర్షిత, ల్యాబ్ అసిస్టిటెంట్ మురళీమోహన్, నర్సులు ప్రవీణ, రేణుకమ్మలను సస్పెండ్ చేశారు. కొన్ని రోజులుగా పరిపాలన లోపాలకు బాధ్యులైన ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్నాథంకు, డాక్టర్ భవానీకి షోకాజ్ నోటీసులిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details