ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించండి: హెడ్​ నర్సులు - Head nurses required to permanent employees news update

తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని హెడ్ నర్సులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 2007లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులుగా విధులకు వచ్చామని, చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Head nurses are required
శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని హెడ్​ నర్సులు వినతిపత్రం

By

Published : Jul 7, 2020, 11:31 PM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని... ఏపీ ఔట్ సోర్సింగ్ హెడ్ నర్సుల యూనియన్ బాధ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ప్రజాసంకల్ప యాత్ర సమయంలో జగన్... తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తుచేశారు. కార్పోరేషన్ ఏర్పాటు చేసి కొత్తగా విధులకు వచ్చే వారికి రూ. 30 వేలు ఇస్తూ... ముందు నుంచి పనిచేస్తున్న వారికి 22 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details