అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్-19 టీకా తీసుకున్న కొద్దిసేపటికే ఓ మహిళా నర్స్ సొమ్మసిల్లి పడిపోయింది. ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ దయాకర్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వ్యాక్సిన్‌ను మొదటగా పద్మావతి అనే మహిళ హెడ్ నర్స్‌కు వేశారు. టీకా వేసిన కొద్దిసేపటికే నర్స్ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికి నర్స్ స్పృహలోకి రావడంతో వైద్య అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
కొవిడ్ టీకా తీసుకుని సొమ్మసిల్లిన హెడ్ నర్స్.. కొద్దిసేపటికే.. - బుక్కరాయసముద్రం తాజా వార్తలు
కొవిడ్ టీకా తీసుకున్న ఓ మహిళా హెడ్ నర్స్ సొమ్మసిల్లి పడిపోయిన ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. ఫలితంగా ఒక్కసారిగా అక్కడున్నవారంతా ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికి నర్స్ సృహలోకి రావడంతో వైద్య అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
![కొవిడ్ టీకా తీసుకుని సొమ్మసిల్లిన హెడ్ నర్స్.. కొద్దిసేపటికే.. head nurse who got sick after taking covid vaccine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10287778-396-10287778-1610978786907.jpg)
కొవిడ్ టీకా తీసుకుని సొమ్మసిల్లిన హెడ్ నర్స్