అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండలంలోని నవాబుకోట ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు నారాయణస్వామి. ద్విచక్ర వాహనంపై మండలంలోని మానవ వనరుల కేంద్రానికి బయలుదేరాడు. మామిళ్లకుంటపల్లికి చేరుకోగానే.. ఫిట్స్ వచ్చింది. రోడ్డు పక్కనే కింద పడిపోయాడు. కరోనా భయంతో స్థానికులెవరూ.. ఆయన దగ్గరకు రాలేదు. ఎవరో 108కి సమాచారం అందించారు. అదీ రాలేదు.
మానవత్వం మంటగలిసింది.. 108 లేటైంది.. అయినా ప్రాణం దక్కింది - అనంతపురంలో ఫిట్స్‌తో హెడ్ మాస్టర్ న్యూస్
ఎంతో మంది భవిష్యత్‌కు దారి చూపిన గురువు అతడు. కానీ రోడ్డు మీద పడిపోతే.. అతడిని ఎవరూ.. పట్టించుకోలేదు. కనీసం దగ్గరికీ వెళ్లలేదు. 108కి సమాచారం ఇచ్చినా.. అది రాలేదు. తోటి ఉపాధ్యాయుల వల్ల ప్రధానోపాధ్యాయుడి ప్రాణాలు దక్కాయి.
ఎలాగోలా తోటి ఉపాధ్యాయులకు విషయం తెలిసింది. నారాయణస్వామిని ఆటోలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడి ఆరోగ్యం బాగానే ఉందని.. మెరుగైన వైద్యం కోసం కదిరికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యాధికారి ఐనూద్దీన్ను వివరణ అడగ్గా... 108 వాహనం మరమ్మతులకు గురైందని.. ఏవైనా కేసులు వస్తే ఇక్కడికి దగ్గరలో ఉన్న అమడగూరు 108 వాహనం వస్తుందన్నారు. అమడగూరు వాహనం వైద్య సేవల నిమిత్తం అనంతపురం వెళ్లిందని తెలిపారు.
ఇదీ చదవండి: తల్లి కడుపులోనే బిడ్డ మృతి.. నిర్లక్ష్యం.. పేదరికమే కారణం!