ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా కాలువలో పడి హెడ్ కానిస్టేబుల్ మృతి - అనంతపురంలో హంద్రీనీవా కాలువలో పడి హెడ్ కానిస్టేబుల్ మృతి వార్తలు

అనంతపురం జిల్లా విరుపాపల్లి గేటు సమీపంలో నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా కాలువ వద్ద ప్రమాదం జరిగింది. బెలుగుప్ప పోలీస్ స్టేషన్​లో విధులు ముగించుకున్న హెడ్ కానిస్టేబుల్ సూరి... ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న కాలువలో పడి మృతిచెందాడు.

head constable death by felling into Handrineva canal which is under construction at ananthapur
నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా కాలువలో పడి హెడ్ కానిస్టేబుల్ మృతి

By

Published : Nov 14, 2020, 11:24 AM IST

అనంతపురం జిల్లా విరుపాపల్లి గేటు సమీపంలో నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా కాలువ వద్ద ప్రమాదం జరిగింది. బెలుగుప్ప పోలీస్ స్టేషన్​లో విధులు ముగించుకున్న హెడ్ కానిస్టేబుల్ సూరి... తిరిగి కళ్యాణదుర్గం వైపు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా కాలువలో పడి సూరి మృతి చెందాడు. అక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కానిస్టేబుల్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సౌమ్యుడు, మంచి పోలీసుగా పేరు తెచ్చుకున్న సూరి మృతితీరని లోటని డీఎస్పీ అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details