పప్పు శనగ నూర్పిడి యంత్రం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ మండలం జి.కొట్టాల గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. జి.కొట్టాల గ్రామానికి చెందిన 16 మంది కూలీలు పంట పొలాల్లో పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. గ్రామ సమీపంలోకి రాగానే నూర్పిడి యంత్రం అదుపుతప్పి బోల్తా పడంది. అందులో ప్రయాణిస్తున్న లక్ష్మీ నరసమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పంట నూర్పుడి యంత్రం బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు - పంట నూర్పుడి యంత్రం బోల్తా తాజా వార్తలు
అనంతపురం జిల్లా జి.కొట్టాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పప్పు శనగ నూర్పిడి యంత్రం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
పంట నూర్పుడి యంత్రం బోల్తా
TAGGED:
పంట నూర్పుడి యంత్రం బోల్తా