రాష్ట్రంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర - HANUMAN
రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతీ జిల్లాలో హనుమాన్ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. ప్రకాశం జిల్లా చీరాలలో హనుమాన్ శోభాయాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్రలో 9 అడుగుల హనుమంతుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీ వజ్ర అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠపాన ఘనంగా నిర్వహించారు. ఆదోనిలో స్వామివారి రథోత్సవం అలరించింది. ప్రకాశంజిల్లాలోనూ హనుమాన్న జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. వీరాంజనేయస్వామి దేవాలయంలో 32 వ తిరునాళ్ళ మహోత్సవాన్ని సంబరంగా చేశారు. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని భక్తులు పెద్ద ఎత్తున సందర్శించారు.