అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్ వ్రత వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి మాల ధారణ ధరించిన భక్తులు స్వామి వారికి ఇరుముడిలు సమర్పించి అనంతరం స్వామివారి వ్రత వేడుకల్లో పాల్గొన్నారు. కొవిడ్ నేపథ్యంలో భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఆలయ అధికారులు వీడియో తెరల ద్వారా బహిరంగ ప్రదేశాల్లో వ్రత వేడుకలను వీక్షించేందుకు అవకాశం కల్పించారు. అనంతరం స్వామి వారికి ఆలయ పండితులు దేవాలయ ముఖమండపం నందు హనుమద్దీక్షాస్వాములచే సమర్పించిన ఇరుముడుల ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన ఈవో రామాంజనేయులు, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ సుగుణమ్మ ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులు హనుమద్దీక్షాస్వాములు పాల్గొన్నారు.
కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమద్ వ్రత వేడుకలు
అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమద్ వ్రత వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామి వారికి ఇరుముడిలు సమర్పించారు. అనంతరం స్వామి వారికి ఆలయ పండితులు దేవాలయ ముఖమండపం నందు హనుమద్దీక్షాస్వాములచే సమర్పించిన ఇరుముడుల ప్రత్యేక పూజలు చేశారు.
కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమద్ వ్రత వేడుకలు