దివ్యాంగులకు కేటాయించిన ఇళ్లస్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కదిరిలో క్రాంతి దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని సర్వే నంబర్ 81 లో 80 మంది దివ్యాంగులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేసిందని వారు తెలిపారు. వీరిలో 18 మంది ఇళ్లు నిర్మించుకున్నారు.
మిగతా వారు ఇళ్లు కట్టుకోలేకపోవడాన్ని అదనుగా చేసుకున్న కొందరు అక్రమార్కులు స్థలాలను ఆక్రమించుకున్నారని బాధితులు వాపోయారు. అధికారులు వెంటనే ఈ విషయంలో అప్రమత్తమై తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో రామసుబ్బయ్యకు అందజేశారు.