అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం జి. కొట్టాలలో హంద్రీనీవా 444.60 కిలోమీటర్ల వద్ద కాలువకు గండి కొట్టే విషయమై ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గానికి నీరు తరలించాలని మంత్రి గుమ్మనూరు జయరాం... తన అనుచరులతో కలిసి కాలువ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిబంధనలకు విరుద్ధమంటూ గండి ప్రయత్నాలను అడ్డుకున్నారు. అయినా మంత్రి అనుచరులు కాలువను తవ్వే ప్రయత్నం చేయటంతో... జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా వైకాపా శ్రేణులు అక్కడే బైఠాయించాయి. ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు సమీపంలోనే కారులో ఉన్న మంత్రి జయరాం అనుమతి కోసం ఫోన్‌లో ఉన్నతాధికారులతో ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. ఎట్టకేలకు తన అనుచరుల చేత గండి కొట్టించారు.
కోతకు గురైన ప్రధాన కాలువ...