అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని హంద్రీనీవా కాలువ గట్టు కుంగింది. దీంతో 56వ ప్యాకేజీలోని 129వ కిలోమీటర్ మణూరు చెరువు వద్ద గండి పడింది. నీరంతా పక్కనున్న కల్లుమరి గ్రామ చెరువులో చేరుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రవాహం ఉద్ధృతమై పంటపొలాలు మునిగిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పరిస్థితి అంతవరకు రాకముందే అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
హంద్రీనీవా కాలువకు గండి.. రైతుల ఆందోళన - మడకశిరలో హంద్రీనీవా కాలువకు గండి వార్తలు
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని హంద్రీనీవా కాలువకు గండిపడింది. ప్రవాహం ఉద్ధృతమై నీరు పంటపొలాల్లో చేరి పంట పాడైపోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
హంద్రీనీవా కాలువకు గండి