కర్నూలు జిల్లాలో హంద్రీనీవా కాలువకు అక్రమంగా ఏర్పాటు చేసిన తూములతో కాల్వ తెగిపోయే ప్రమాదం ఉందంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా మద్దికెర లో ఏర్పాటుచేసిన అనధికార తూములతో కాల్వ తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని వెంటనే పూడ్చాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
'హంద్రీనీవా కాలువ అక్రమ తూములను పూడ్చాలి' - HANDRINEEVA CANAL IN KURNOOL
కర్నూలు జిల్లాలో హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన అక్రమ తూములను వెంటనే పూడ్చాలని రైతులు నిరసన చేపట్టారు. వీటితో కాలువ తెగిపోయి, పంట మునిగిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
!['హంద్రీనీవా కాలువ అక్రమ తూములను పూడ్చాలి' HANDRINEEVA CANAL IN KURNOOL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6140525-469-6140525-1582200553001.jpg)
కర్నూలు జిల్లాలో హంద్రినీవా కాలువ