హంద్రీనీవా కాల్వకు గండి... భారీగా నీరు వృథా - హంద్రీనీవా కెనాల్‌కు గండి వార్తలు
అనంతపురం జిల్లా సింగిరివాండ్లపల్లి వద్ద హంద్రీనీవా పుంగనూరు కాల్వకు గండి పడింది. చెర్లోపల్లి జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తుండగా.. ప్రవాహం పెరిగి గట్టు కోతకు గురైంది. గండి పడటం వలన భారీగా నీరు వృథా అయ్యింది. గట్టు పునరుద్ధరణకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జలాశయం గేట్లు మూసివేసి గట్టు పునరుద్ధరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
హంద్రీనీవా కాల్వకు గండి... భారీగా నీరు వృథా
ఇదీ చదవండి :అమరావతి మద్దతుగా.. లండన్‌లో ప్రవాసాంధ్రుల నిరసన