ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేనేత కార్మికుల నైపుణ్యం... పట్టుచీరపై అమ్మవారి ప్రతిరూపం - handloom news at anantapur dst

కర్నూలు జిల్లా ప్రసిద్ధి గాంచిన నందవరం చౌడేశ్వరీ అమ్మవారి ప్రతిరూపాన్ని పట్టుచీరపై చేయించాడు ఓ భక్తుడు.అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు ఎంతో అందంగా అమ్మవారి రూపాన్ని ముద్రించారు.. మీరు ఓసారి చూడండి...

handloom workers print lord chowdeswari ammavari pic on pattu sarry at antapur dst dharamvaram
పట్టుచీరపై అమ్మవారి ప్రతిరూపాన్ని వేసిన చేనేత కార్మికులు

By

Published : Mar 14, 2020, 11:44 AM IST

వరాలిచ్చే తల్లిగా పేరొందిన కర్నూలు జిల్లా నందవరం చౌడేశ్వరి అమ్మవారి ప్రతి రూపాన్ని అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు మగ్గంపై తయారు చేశారు. ధర్మవరం రామ్​నగర్​కు చెందిన చేనేత పట్టు చీరల వ్యాపారి పామి శెట్టి లక్ష్మీనారాయణ ఈ చీరను తయారు చేయించాడు. చేనేత డిజైనర్ వెంకటేష్ అమ్మవారి ప్రతిరూపాన్ని పట్టు చీరపై రూపొందించారు. ఎనిమిది గజాల పట్టు చీర పై అమ్మవారి ప్రతిమ వివిధ డిజైన్లలో వేశారు. నందవరం చౌడేశ్వరి అమ్మవారికి పట్టుచీరను సమర్పించనున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.

పట్టుచీరపై అమ్మవారి ప్రతిరూపాన్ని వేసిన చేనేత కార్మికులు

ABOUT THE AUTHOR

...view details