ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడి ఆత్మహత్య - ధర్మవరం చేనేత కార్మకుడి ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక చేనేత కార్మికుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.

suicide handloom worker
అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడి ఆత్మహత్య

By

Published : Dec 31, 2020, 11:54 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ధర్మవరం శంకరాపురం కాలనీకి చెందిన క్రిష్ణగిరి ఆంజనేయులు (27) సొంత మగ్గం ఏర్పాటు చేసుకుని మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో 5 లక్షల వరకు అప్పు చేశాడు. కరోనా లాక్ డౌన్ వల్ల ఆరు నెలల పాటు మగ్గం నడవక ఉపాధి కోల్పోయాడు.

అప్పులు తీర్చే మార్గం లేక... అప్పులు ఇచ్చిన వారు డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడాన్ని తట్టుకోలేక.. ఆంజనేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడికి భార్య ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details