అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇస్లాం భాష(27) అనే చేనేత కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీలో నివసిస్తున్న ఇస్లాం భాష అదే కాలనీలో ఉన్న పట్టుగూళ్ల రీలింగ్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. రాత్రి గదిలోకి వెళ్లి ఉరితాడు బిగించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ప్రపంచాన్ని వదిలిపోతున్నాను అంటూ వాట్సాప్లో స్టేటస్ పెట్టాడు. స్నేహితులు కుటుంబ సభ్యులు చూసే లోపే ఇస్లాం భాష ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సున్నిత మనస్తత్వం కలిగి ఉండేవాడిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచాన్ని వదిలిపోతున్నా: చేనేత కార్మికుడి ఆత్మహత్య
ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు ప్రపంచాన్ని వదిలిపోతున్నట్లు వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు. తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ధన్యవాదాలు తెలిపి.. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Handloom worker sucide in ananthapuram