అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో చేనేత కార్మికుడు మృతి చెందాడు. మద్యం మత్తులో ఉన్న దీపక్ కుమార్ ఫోన్ మాట్లాడుతూ ఇంటి పైకి వెళ్లాడు. అక్కడ ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంటు తీగలను గమనించక వాటిని తాకడంతో షాక్ కొట్టింది. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
విద్యుదాఘాతంతో చేనేత కార్మికుడి మృతి - ధర్మవరంలో చేనేత కార్మికుడి మృతి
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో విద్యుదాఘాతంతో చేనేత కార్మికుడు మృతి చెందాడు. ఫోన్ మాట్లాడుతూ వేలాడుతున్న కరెంటు తీగను తాకడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
విద్యుదాఘాతంతో చేనేత కార్మికుడు మృతి