ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శానిటైజర్ తాగి చేనేత కార్మికుడు మృతి - dharmavaram crime news

శానిటైజర్ తాగి చేనేత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

men died sanitizer drink
ధర్మవరంలో శానిటైజర్ తాగి చేనేత కార్మికుడు మృతి

By

Published : May 19, 2021, 6:45 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో శానిటైజర్ తాగి వీరేష్ అనే చేనేత కార్మికుడు మృతి చెందాడు. పట్టు చీరల పాలిష్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వీరేశ్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శానిటైజర్ తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details