అనంతపురం జిల్లా ధర్మవరం.. రాష్ట్రంలోనే చేనేత పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే పట్టు చీరలు దేశంలోని వివిధ నగరాలకు ఎగుమతి చేస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూమిలో ఇంకిన నీరు మగ్గం గుంతలోకి చేరుతోంది. ధర్మవరం పట్టణంలోని శివనగర్, చంద్రబాబు కాలనీ, శాంతినగర్, పార్థసారధి నగర్ ప్రాంతాలలో మగ్గం గుంతలోకి నీరు ఉబికి వస్తుంది.
ఈ కారణంగా మగ్గాలు నేసేందుకు వీలు కావడం లేదు. గుంతల్లో ఊరుతున్న నీటిని కార్మికులు బయటకు ఎత్తి పోస్తున్నారు. మగ్గంపై ఉన్న పట్టు చీరలు దారం పనికిరాకుండా పోయాయి. ఒక్కో కార్మికుడు రూ.40 వేలకుపైగా నష్టపోయాడు. పట్టణంలో 500 మందికి పైగా కార్మికులు ఉపాధి లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.