ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు సమస్యలపై దివ్యాంగుడి నిరాహార దీక్ష - మడకశిరలో దివ్యాంగుడు నిరాహార దీక్ష

రైతులు, పేదల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ... తెలుగుదేశం పార్టీ కార్యకర్త రంగనాథ్ అనే దివ్యాంగుడు 12 గంటల నిరాహార దీక్షకు పూనుకొన్నారు.

handicapped person huger strike in madasira
handicapped person huger strike in madasira

By

Published : Apr 20, 2020, 8:32 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోట్ల రంగనాథ్ 12 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న రైతులు, పేదలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ ఉదయం 9 గంటల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. లాక్​డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన పంట అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details