ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విభిన్న ప్రతిభావంతుడి ఔధార్యం.. సొంత ఖర్చులతో అన్నదానం - Handicapped food distribution latest news

అవయవాల విషయంలోనే తాను వికలాంగుడిని, ఎదుటివారికి సాయం చేయడంలో మాత్రం సంపన్నుడినే అంటున్నాడు అనంతపురానికి చెందిన ఉద్దీప్​ సింహ. నగరంలో బిచ్చగాళ్లను, వృద్ధులను, అనాథులను గుర్తించి వారి ఉన్న చోటకే వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నాడీ దివ్యాంగుడు.

Handicapped food distribution to poor people
పేదలకు అన్నదానం చేస్తున్న దివ్యాంగుడు

By

Published : May 4, 2020, 10:38 AM IST


ఓ మనసున్న వికలాంగుడు లాక్​డౌన్ నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పలువురు అనాథలు, బిచ్చగాళ్లు, వృద్ధులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నాడు. పట్టణంలో ఒంటరి మహిళలను ఆకలితో అలమటిస్తున్నవారిని గుర్తించి వారి ఉన్న చోటికే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాడు. ఉద్దీప్ సింహా అనే యువకుడు పలువురు దాతల నుంచి సేకరించిన ఆహార పదార్థాలతోపాటు, తన సొంత డబ్బులతో వీరికి ఆహారాన్ని సమకూర్చుతున్నాడు. ఆదివారం రోజున మాంసాహార భోజనం ఈ యువకుడు అందిస్తుండటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details