అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో వేరుశనగ బస్తాలg లారీల్లో నింపే హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాలకు లారీలతో బస్తాలను చేరవేస్తుంటారు. మార్కెట్ యార్డ్లో గోదామును నుంచి లారీలో నింపి లాక్డౌన్ కారణంగా అదే లారీలో తిరిగి హమాలీలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుండటం అధికారుల కంట పడింది. వీరు లేకపోతే లారీలను నింపేందుకు హమాలీలు కరవయ్యారని ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదని అధికారులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు నిరసనగా మూడు గంటల పాటు హమాలీలు తమ నిరసనను చేపట్టారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు మల్లికార్జున జోక్యం చేసుకుని.. ప్రస్తుతం లోడ్ చేసినందుకు ఐదు రూపాయలు ఇస్తున్నామని ఇక్కడే ఉండి లోడ్ చేస్తే మరో రూపాయి కలిపి ఆరు రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.
వేరుశనగ బస్తాలు నింపే హమాలీల నిరసన... - latest kalyanadurgam news
విత్తన వేరుశెనగ బస్తాలు నింపే హమాలీలు కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో నిరసన చేపట్టారు. సొంత గ్రామాలకి వేళ్లకూడదన్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు కలగజేసుకోవటంతో వ్యవహారం సద్దుమణిగింది.
Breaking News
TAGGED:
lock down news