కూలి రేట్లు పెంచి ప్రమాద బీమా కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు అనంతపురం జిల్లాలో మోకాళ్ళపై నిరసన చేశారు. కరోనా సమయంలో కూడా హమాలీలు తమ ఆరోగ్యం గురుంచి ఆలోచించకుండా పని చేస్తున్నారని, వారికి ప్రమాద బీమా సౌకర్యం, ఈఎస్ఐ వెంటనే కల్పించాలని సీఐటీయూ అనంతపురం జిల్లా అధ్యక్షురాలు నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జనవరిలో పెంచాల్సిన కూలి రేట్లు నేటి వరకు పెంచలేదని...అనేకసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. కరోనా నేపథ్యంలో నెలలో రెండు డ్యూటీలు చేస్తున్నామని ప్రభుత్వం నుంచి కనీసం మాస్కులు, గ్లౌజులు కూడా ఇవ్వలేదన్నారు.