గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లాలో వడగండ్ల వాన పడింది. ఆత్మకూరు, మడకశిర పట్టణంలో గాలి వానకు చెట్లు నేలకొరగడంతో పలు కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిద్ధరాంపురం గ్రామంలోనే సుమారు 70ఎకరాల్లో అరటి పంట నేలకొరిగింది. బెలుగుప్ప మండలంలోని జీడిపల్లి, కాలువపల్లి, హానిమిరెడ్డి పల్లి, జీడీపల్లి, కొనంపల్లిలో వడగళ్ల వర్షం కురిసింది. వడగండ్ల వర్షం, గాలి వానకు పలుచోట్ల అరటిచెట్లు నేలకొరిగాయి. పంట కాపుకొచ్చే దశలో ఇలా జరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం - ఆత్మకూరులో వడగండ్ల వర్షం వార్తలు
అనంతపురం జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆత్మకూరు మండలంలో గాలివానకు పంటలు నేలకొరిగాయి. సిద్ధరాంపురం గ్రామంలోనే సుమారు 70 ఎకరాల్లో అరటి పంట నేలకొరిగింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

అనంతపురం జిల్లాలో వడగండ్ల వర్షం