RTC bus stand roof collapses in Anantapur district: అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ పైకప్పు పెచ్చులు ఊడిపడి.. సుధా అనే మహిళ ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. అకస్మాత్తుగా పైకప్పులు పెచ్చులూడి పడడంతో.. బస్టాండ్లోని ప్రయాణికులు భయంతో బయటికు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన సుధ అనే మహిళ ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. గాయపడిన మహిళను ఆర్టీసీ అధికారులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
గుత్తి బస్టాండ్‌లో ఊడిపడ్డ పైకప్పు పెచ్చులు.. ప్రయాణికురాలికి తీవ్రగాయాలు - RTC bus stand roof collapses news
Gutti RTC bus stand roof collapses, injuring passengers: గుత్తి ఆర్టీసీ బస్టాండు పైకప్పు పెచ్చులూడి ప్రయాణికులపై పడ్డాయి. ఈ ఘటనలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సకోసం బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్టాండ్ శిథిలావస్థలో ఉందని.. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు..
గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం
ఆర్టీసీ బస్టాండ్ పైకప్పు శిథిల వ్యవస్థలో ఉందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని గాయపడిన ప్రయాణికురాలు కోరింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి