అదనపు కట్నం కోసం భర్తే భార్యను కడతేర్చిన ఘటనను గుత్తి పోలీసులు ఛేదించారు. గత వారం అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లిలో ఈ నెల 11 వ తేదీన చెంచులక్ష్మి అనే మహిళ హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధించి భర్తే గొంతు నులిమి చంపినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వారంలోపే నిందితులను పట్టుకున్నారు. భర్తతో పాటు 9 మంది నిందితులను గుత్తి పోలీసులు రిమాండ్కు తరలించారు. కట్నంగా తీసుకున్న ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ మాట్లాడుతూ.. గొంతు నులిమి చంపి.. ఏమీ తెలియనట్లుగా విషపు గుళికలు మింగిందని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారనన్నారు. నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బాచుపల్లి హత్య కేసును ఛేదించిన గుత్తి పోలీసులు - బాచుపల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్
అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చిన ఘటనను గుత్తి పోలీసులు ఛేదించారు. భర్తతో పాటు 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
anantapuram district gutthi police solved bachupalli murder case
TAGGED:
బాచుపల్లి హత్య తాజా వార్తలు